నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు వేసిన – నందవరపు శ్రీనివాసరావు మరియు కుటుంబ సభ్యులు..
సాక్షిత:- అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ పంచాయతీ గండివానిపాలెం గ్రామంలో మామిడి తోటలో (చేలు) ఉన్న పుట్ట వద్ద నందవరపు శ్రీనివాస్ రావు కుటుంబ సభ్యులతో కలిసి పవిత్రంగా భక్తిశ్రద్ధలతో పూజ చేసి పుట్టలో పుష్పాలు, కోడిగుడ్లు,పాలు,చలిమిడి వేసి మొక్కలు తీర్చుకున్నారు.నాగుల చవితి సందర్భంగా నాగేంద్రుని శివభావంతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని నమ్మకం.అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ నాగదేవత మా కులదేవతని, నాగదేవత ఆశీస్సులతో మా ప్రాంత ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆర్యఆరోగ్యాలతో ఉండాలని కోరారు. మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రకారం ఆనవాయితీ ప్రకారంగా కుటుంబ సభ్యులతో కలిసి పొట్టలో పాలు వెయ్యటం జరిగినది.