Name financial support to the poor
అర్హులైన పేదలందరికీ సీఎంఆర్ఎఫ్
ఎంపీ నామ చొరవతో 9 మందికి మంజూరైన రూ. 3,22,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కనకమేడల
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ, అవిరళ కృషి ఫలితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పేదలకు పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్ సాయం అందుతుందని ఎంపీ నామ క్యాంప్ ఆఫీస్ ఇన్చార్జి కనకమేడల సత్యనారాయణ పేర్కొన్నారు.
క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్, ఖమ్మం రూరల్, చింతకాని, ముదిగొండ, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, కొణిజర్ల, సింగరేణి మండలాలకు చెందిన 9 మంది లబ్ధిదారులకు రూ.3,22,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కనకమేడల ఆయా మండలాల నాయకులతో కలసి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా కనకమేడల మాట్లాడుతూ పేద ప్రజలకు ఖరీదైన వైద్యం భారం కాకూడదని ఎంపీ నామ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తూ పేద ప్రజలను ఆదుకుంటున్నారని అన్నారు. అనారోగ్యంతో అన్నత్రుల్లో చేరి చికిత్స చేయించుకుని, ఆర్ధిక సాయం కోసం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేదలకు సత్వరమే ఆర్ధిక సాయం అందేలా కృషి చేస్తున్నారని అన్నారు.
దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సకాలంలో సాయం అందిస్తూ నామ పేదల మన్ననలు అందుకుంటున్నారని అన్నారు. ఈ పధకం పేదలకు ఎంతో ఆసరాగా ఉంటుందన్నారు. సీఎంఆర్ఎఫ్ పథకం పేద, బడుగు , బలహీన వర్గాలకు నూతన జవసత్వాలు అందిస్తుందని అన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతనే అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందుతున్నాయని కనకమేడల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎన్ వైరా మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, కొణిజర్ల మండలం తనికెళ్ల ఎంపిటిసి గుండ్ల కోటేశ్వరరావు, ఎర్రుపాలెం మండల రైతు బంధు సమన్వయ సమితి కన్వీనర్ వేమిరెడ్డి రాఘవరెడ్డి, పార్టీ బోనకల్ మండల నాయకులు తన్నీరు రవి కుమార్, తమ్మారపు బ్రహ్మయ్య, లబ్ధిదారులు
వి. రామకృష్ణ, తోళ్ల దుర్గా భవాని, ఎం.సంధ్య, షేక్ సలీం, ఆర్.నవీన్, ఆరికోట్ల విజయకుమార్, ఎన్.డి. జహిరాబి, బండి విజయకుమారి, బాణోత్ పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎంపీ నామకు కృతజ్ఞతలు తెలిపారు.