SAKSHITHA NEWS

Nama’s anger against the railway officials

రైల్వే అధికారులపై నామ ఆగ్రహం

ఖమ్మం రైల్వే స్టేషన్ ను
తనిఖీ చేసిన నామ

మోడల్ స్టేషన్ గా ఖమ్మం రైల్వే స్టేషన్ : నామ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

రైల్వే అధికారుల పై బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నేత,ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీ నామ ఖమ్మం రైల్వే స్టేషన్ ను సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఖమ్మం రైల్వేస్టేషన్ లో సౌకర్యాలు లేమి పైఅధికారుల పై మండిపడ్డారు. నిర్మాణంలో ఎస్కలేటర్ ను, ప్లాట్ ఫాం మొత్తం తిరిగి, పారిశుద్ధ్యం, ప్లాట్ ఫాం పరిశీలించారు.

స్టేషన్ లో మంచినీటి కేబిన్ మూసి ఉండడంతో అధికారుల పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎందుకు మూశారు.. ప్రయాణీకులకు మంచినీళ్లు ఎలా? అని ప్రశించారు. వెంటనే మంచినీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మురుగునీటి కాల్వను పరిశీలించి, శాశ్వత ప్రాతిపదికన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారుల కు సూచించారు.

గ్రీనరీని అభివృద్ధి చేసి, స్టేషన్ ను సుందరంగా తీర్చి దిద్దాలని సూచించారు. గ్రీనరీ ఏర్పాటు సక్రమంగా చేయలేకపోవడంతో అధికారుల పై ఆగ్రహం వ్యక్తంచేశారు. సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. సీసీ కెమెరా లు 8 ఉన్నాయని, ఇంకా 60 దాకా ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. దొంగతనాల నిరోధానికి సీసీ కెమెరాలు మరిన్ని ఏర్పాటు చేయాలని కోరారు. స్టేషన్ ను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

స్టేషన్ బయట ఆటో కార్మికుల కు కోసం ఆటోలు నిలుపుదల కోసం ఆటో షెడ్డు , మంచినీటి ట్యాప్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా స్టేషన్లో ప్రత్యేకించి ప్రయాణీకులతో మాట్లాడారు. అనంతరం సారథి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదిత ప్రదేశాన్ని పరిశీలించి, నిర్మాణానికి ఆవరోదంగా ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు ను కోరారు.

తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై
కేంద్రం వివక్ష

రైల్వే కి సంబంధించి కేంద్రం వద్ద చాలా పెండింగ్ లో ఉన్నాయని, ఈ విషయంలో కేంద్రం నుంచి సరైన మద్దతు లభించడం లేదని ఎంపీ నామ నాగేశ్వరరావు రైల్వే తీరుపై మండిపడ్డారు. ఖమ్మం రైల్వేస్టేషన్ పరిశీలన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణా లో రైల్వే స్టేషన్ల ఆ ఆభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మోడల్ స్టేషన్ల గా అభివృద్ధి చేయాలని కేంద్ర రైల్వే మంత్రిని కోరడంతో పాటు పార్లమెంట్ లో కూడా ప్రస్తావించడం జరిగిందని అన్నారు.

విభజన హామీ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ని ఏర్పాటు చేయకుండా కేంద్రం వివక్షత చూపిస్తుందని అన్నారు. వెంటనే తెలంగాణా కు సంబంధించి పెండింగులో ఉన్న అన్ని అంశాలను పరిష్కరించాలని కోరారు. తెలంగాణ లోని అన్ని రైల్వే స్టేషన్లను అన్ని హంగులతో ఆధునీకరించాలన్నారు. ఖమ్మం రైల్వే స్టేషన్ లోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారుల కు తెలిపినట్లు చెప్పారు


రెండు ఏళ్ల క్రితం సీసీ కెమెరాలు, ఎస్కరేటర్లు ఏర్పాటు చేయాలని కోరినా ఇంతవరకు పూర్తి కాలేదన్నారు.ఖమ్మం స్టేషన్ ను మోడల్ స్టేషన్ గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.ఆ మేరకు ఇప్పటికే సంబంధిత కేంద్ర మంత్రి తోను, అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు.ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ సురభి తో పాటు రైల్వే అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS