SAKSHITHA NEWS

తల్లాడ మండలంలో నామ పర్యటన

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్;

బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు , ఖమ్మం పార్లమెంటు సభ్యులు
నామ నాగేశ్వరరావు శనివారం
తల్లాడ మండలంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య , స్థానిక నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటిస్తారని ఖమ్మంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ సందర్భంగా పలు గ్రామాల్లో జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు , తదితర అభివృద్ధి కార్యక్రమాల్లో నామ పాల్గొంటారు. పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు , కార్యకర్తలు అభిమానులు, శ్రేయోభి లాషులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎంపీ క్యాంప్ కార్యాలయం కోరింది .


SAKSHITHA NEWS