Nama mourns Kaikala’s death We have lost a great actor: Nama
కైకాల మృతికి నామ సంతాపం
గొప్ప నటుడిని కోల్పోయాం: నామ
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ :
సీనియర్ సినీ నటుడు,మాజీ పార్లమెంట్ సభ్యులు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందడం పట్ల బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేసి, సంతాపం తెలిపారు.
కైకాల మృతి పట్ల కుటుంబ సభ్యులకు , అభిమానులకు, ఆత్మీయులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ , వారి కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని దైవాన్ని వేడుకున్నారు. తెలుగు ప్రజలు గర్వించ తగ్గ నటుడని అన్నారు.
నటుడిగా వైవిధ్యమైన విభిన్న పాత్రలను పోషించి, ప్రేక్షకుల ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్నారని , ఆయన మృతి చలన చిత్ర పరిశ్రమకు,తెలుగు వారికి తీరని లోటని నామ పేర్కొన్నారు.60 ఏళ్లపాటు తన నటనతో తిరుగులేని నటుడిగా అశేషాభిమానాన్ని సంపాదించుకున్నారని నామ కొనియాడారు.
ఎన్టీఆర్ తో కలిసి సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించి, గొప్ప అభినయం చూపారన్నారు. మచిలీపట్నం ఎంపీ గా రాజకీయ రంగంలో కూడా తనదైన శైలీలో రాణించారని అన్నారు. ఎంపీ గా ప్రజలకు మరింత దగ్గరయ్యారని నామ పేర్కొన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా నామ గుర్తు చేసుకున్నారు.