SAKSHITHA NEWS

వరంగల్ పశ్చిమ నియోజక అభివృద్దే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం.. నాయిని రాజేందర్ రెడ్డి…

రోజు న్యూ బస్టాండ్ రోడ్ హనుమాన్ టెంపుల్ దగ్గర హన్మకొండ 10వ డివిజన్ లో మూడున్నర కోట్లతో స్మార్ట్ సిటీ లో భాగంగా రోడ్లు మరియు డ్రైనేజ్ పనులకు వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ శ్రీమతి గుండు సుధారాణి మరియు కార్పోరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లడుతూ …

గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోని 10వ డివిజన్ ని కాంగ్రెస్ అధికారం చేపట్టిన కొన్ని డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఇకముందు కూడా ఇంకెన్నో అభివృద్ధి పనులను చేపట్టబోతున్నామని అన్నారు.

పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నడుస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు

దశల వారిగా అన్ని వార్డులలో సైడ్ డ్రైన్, సీసీ రోడ్ల పనులను చేస్తున్నామని రోడ్డు నిర్మాణ పనుల్లో స్థానిక కాలనీ వాసులు ప్రభుత్వానికి సంహరించాలని కోరారు.కాలనీలలో ఎటువంటి సమస్యలు ఉన్న నా దృష్టికి తీసుకువస్తే వీలైనంత త్వరలో పరిష్కారం చేస్తానని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రేటర్ వరంగల్ కు మరిన్ని నిధులు తీసుకొచ్చి వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ రోహిత్ సింగ్ టాగూర్ తోట పవన్ గారు10 డివిజన్ అధ్యక్షులు శోభన బోయిన కుమార్ యాదవ్, సైండ్ల శ్రీకాంత్, మంద రాకేష్, పల్లం రమేష్, మాడిశెట్టి సతీష్, జఫర్ ఖాన్ ,షేక్ యాకూబ్, నజీర్ బాయ్, శశి గౌడ్, ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్ ఠాకూర్, నారాయణ సింగ్, నిలేశ్వర్ సింగ్, బజరంగ్ సింగ్, సోమిరెడ్డి సాబ్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల రవికుమార్, తోట ప్రకాష్ అంబటి కుమార్ స్వామి, తోట శ్రీనివాస్, కరువు దశరథం, తోట శ్రీనివాస్, బొల్లం అశోక్ , బండారి మహేందర్, ఫోన్ లక్ష్మణ్ తదతరులు పాల్గొన్నారు.