నైమిశ ఫిజియోథెరపి అండ్ రీ హెబిలిటేషన్ సెంటర్ ను ప్రారంభించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు .
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,
మైలవరం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన నైమిశ ఫిజియోథెరపి అండ్ రీ హెబిలిటేషన్ సెంటర్ ను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ప్రారంభించారు. మైలవరం పట్టణంలో ఫిజియోథెరపీలో అధునాతన వైద్య సేవలు కైరోప్రాక్టిక్ థెరపి, న్యూరోకైనెటిక థెరపి, ఆస్టియోపతి, మాన్యూవల్ థెరపి, కైసాలజీ, ముల్లిగాన్ టెక్నిక్స్ ఏర్పాటు చేసిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నాగరాజును అభినందించారు. సామాన్యు రోగులకు అందుబాటులో ఉండే విధంగా సేవా దృక్పథంతో ఫిజియోథెరపీ సేవలను అందించాలని నైమిశ ఫిజియోథెరపి అండ్ రీ హెబిలిటేషన్ సెంటర్ యాజమాన్యానికి సూచించారు. ఎన్డీఏ మహాకూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.