SAKSHITHA NEWS

శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా గోపులారం గ్రామానికి చెందిన నాగమణి నియామకం అయ్యారు. సోమవారం రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నాగమణికి నియామక పత్రాన్ని అందజేశారు. వైస్ ప్రెసిడెంట్ గా సుశీల, జనరల్ సెక్రెటరీగా ప్రత్యూష రెడ్డి, రేణుక ను నియమించారు. మునిసిపల్ అధ్యక్షులుగా సింధుజ, వైస్ ప్రెసిడెంట్ గా అమృత, రాములమ్మ, అమృత, పుష్పమ్మ లను నియమించారు.

ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ నా యొక్క పనిని గుర్తించి నన్ను మండల మహిళా అధ్యక్షురాలుగా నియమించినందుకు నా పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తూ ప్రజా వ్యతిరేక విధానాల పైన మహిళా హక్కుల కోసం పనిచేస్తూ రాబోవు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం చేకూరే విధంగా కష్టపడి పని చేస్తానని అన్నారు. నా యొక్క నియామకానికి సహకరించిన నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జ్యోతి బీమ్ భరత్ మాట్లాడుతూ రానున్న ఎంపీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరారు. పార్టీ కొరకు ప్రతి ఒక్కరు కష్టపడాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు రవీందర్ రెడ్డి, ఎజాస్, ప్రసాద్, నసిరుద్దీన్, శంకర్, మహబూబ్ హుస్సేన్, శశికాంత్, మల్లికార్జున్, ప్రశాంత్, శ్రీకాంత్, ఉన్నారు.

Whatsapp Image 2024 01 29 At 4.21.05 Pm

SAKSHITHA NEWS