SAKSHITHA NEWS

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూకట్పల్లి నియోజకవర్గాన్ని వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వారి సమస్యలను తెలుసుకుని ప్రతి ఇంటికి మంచినీరు అందేలా నియోజకవర్గంలో రిజర్వ్ ట్యాంకులు నిర్మించుకున్నామని అంతేకాకుండా గల్లీ గల్లీకి సిసి రోడ్లు, ప్రతి ప్రాంతంలోని ఆహ్లాదకరమైన పార్కులు, ఇండోర్ స్టేడియంలు, సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, దళిత బంధు ఆసరా పింఛన్లు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గంలోని ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నామని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు కూడా నేడు కూకట్పల్లిలోని ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నారని.. దీనంతటికీ కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంబిస్తున్న విధానాలే కారణమని అన్నారు.. అందుకని తిరిగి మళ్లీ కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికే పట్టం కట్టాలని తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ..మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్ ,పగుడాల బాబురావు డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు..

Be149170 D449 40c4 A692 Bcde57a3c06a

SAKSHITHA NEWS