SAKSHITHA NEWS

ఎల్లవ్వ మొఖంలో ఆనందం…
ప్రతి ఆడబిడ్డ మొఖంలో చూడాలన్నదే నా కోరిక

గరీబోళ్లు నిలువ నీడకు ఒక గూడు కావాలి. ఆ గూడు ఇవ్వడానికి మంచి మనసు కావాలి. ఆ మనసున్న నాయకత్వం కాంగ్రెస్. ఏడెనిమిది నెలల క్రితం మూడు చింతల పల్లి – లక్ష్మాపూర్ లో కుమ్మరి ఎల్లవ్వకు మాటిచ్చాను. కేసీఆర్ తన ఫాంహౌస్ దారి కోసం ఆ పేదరాలి గూడు కూల్చాడు. ఆ గూడును నిలబెట్టే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకుని ఎల్లవ్వ గృహ ప్రవేశానికి హాజరుకావడం సంతోషంగా ఉంది. ఎల్లవ్వ మొఖంలో ఆనందం చూశాను… రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ మొఖంలో ఇలాంటి ఆనందం చూడాలన్నది నా కోరిక.


SAKSHITHA NEWS