బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ’లో నూతనంగా నిర్మిస్తున్న బసవలింగేశ్వర ఆలయాన్ని బి.ఆర్.ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా బసవేశ్వర స్వామి’కి లింగాయత్ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
మున్సిపల్ పరిధిలో ఆలయాల అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఆలయాల పునరుద్ధరణకు విశేషంగా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రాజ్ గోపాల్ (బొల్లారం మున్సిపల్ బి.ఆర్.ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు), భాస్కర్ (మాజీ వార్డ్ మెంబర్), లింగయ్య స్వామి , పెంటారెడ్డి , సతయ్య , ఈశ్వరయ్య , గోవింద్ , కుర్మయ్య , మధు , భూమన్న , చంద్రశేఖర్ , గురుషాంతప్ప , మహేష్ , రాజు , మన్నెం , లింగాయత్ సంఘం సభ్యులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.