డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
చిట్యాల సాక్షిత ప్రతినిధి
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వార్డు శివనేనిగూడెం లో ఓపెన్ డ్రైనేజ్ నిర్మాణ పనులను మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటరెడ్డి మాట్లాడుతూ డ్రైనేజీ నిర్మాణం పనుల్లో నాణ్యత పాటించాలని నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సదరు కాంట్రాక్టర్ కి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, సింగిల్ విండో వైస్ చైర్మన్ మేండే సైదులు ,బొబ్బిలి బిక్షం రెడ్డి, రుద్రవరం యాదయ్య, కన్నెబోయిన శ్రీశైలం ,బొబ్బిలి సుధాకర్ రెడ్డి,దాసరి నరసింహ, కన్నెబోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు.