SAKSHITHA NEWS

ములుగు జిల్లా చల్పాక ఎన్ కౌంటర్ పై హైకోర్టులో నేడు విచారణ!

హైదరాబాద్:
ములుగు జిల్లా చల్పాక దగ్గర అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టు లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

ఈ ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటన స్థలంలో రెండు ఏకే-47 రైఫిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా.. ఈ ఎన్‌కౌంటర్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌం టర్ పై పలు అనుమానాలు ఉన్నాయని..అన్నంలో విష ప్రయోగం జరిగినట్లు స్థానిక ప్రజలు వ్యక్తపరుస్తున్నారని తెలిపారు.

చనిపోయిన ఏడుగురి మావోయిస్టు మృతదే హాలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్షలు నిర్వహించాలని.. పోస్టుమార్టం సమయంలో వీడియో రికార్డు చేయాలని, పిటిషన్ దాఖలు చేశారు.

దీంతో హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు అయింది, ఈ పిటిషన్ పై ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు హైకోర్టు విచారణ చేపట్టనుంది.


SAKSHITHA NEWS