ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …
సాక్షిత : మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు* బౌరంపేట్ లో నిర్మించనున్న ముదిరాజ్ సంఘం భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి తనవంతు సహకారం అందజేస్తానని అన్నారు. అంతకుముందు కొర్వి వీరాస్వామి ముదిరాజ్ జయంతి ని పురస్కరించుకొని ముదిరాజ్ సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగరాజు యాదవ్, బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నిజాంపేట్ కార్పొరేటర్లు ఆగం రాజు, గాజుల సుజాత, సీనియర్ నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి, మురళి యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, రాము, స్థల దాతలు రాయిలాపురం నర్సింహా, కృష్ణ, శ్రీనివాస్, లింగం, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మన్నె బాలరాజు, శంభీపూర్ భాగయ్య, శేఖర్, చింత బిక్షపతి, చింత మల్లేష్, డి. సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.