Ms. Anam Arunamma is the chair person at Nellore ZP meeting hall
సాక్షిత : నెల్లూరు జడ్పీ సమావేశ మందిరంలో చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ పాలకమండలి సర్వసభ్య సమావేశానికి హాజరైన రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి*
జడ్పిటిసి సభ్యులు సూచించిన ప్రతి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్న మంత్రి
ప్రధానంగా ప్రైవేట్ వైద్యశాలల్లో ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు చేయడం పట్ల సభ్యుల సూచనలు, సలహాలను పరిశీలించి, మరింత సమర్థవంతంగా ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలకు అందేలా చర్యలు చేపడతామని ప్రకటించిన మంత్రి కాకాణి
తెలుగుదేశం హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు చంద్రబాబు డబ్బులు చెల్లించకుండా, పసుపు కుంకుమ పేరిట ఓట్లు రాబట్టుకునేందుకు మహిళలకు పంపిణీ చేసి, ఏ మాత్రం బిడియ పడకుండా, తన హయాంలో జరిగిన పనులకు బిల్లులు చెల్లించాల్సిందిగా చంద్రబాబు కోర్టుకు పంపించి, కోర్టు ఉత్తర్వుల ప్రకారం తెలుగుదేశం హయాంలో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించడంతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడడం తరువాత బిల్లులు చెల్లింపులు, కాస్త జాప్యం కావడం జరిగింది.
అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు మంజూరు చేయాలని సభ్యులు సభ దృష్టికి తీసుకురాగా, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ 1300 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉందని, మార్చిలోగా ఈ నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని, ఈ నిధులు రాగానే పెండింగ్ బిల్లులన్నీ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపిన మంత్రి కాకాణి.*
ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్టామని ప్రధానంగా నెల్లూరు పెన్నా, మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీలను ముఖ్యమంత్రి జాతికి అంకితం చేయడంతో రైతాంగానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా పుష్కలంగా సాగునీరు అందుతుందని వివరించిన మంత్రి.
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు విజయ దీపికలను తిరిగి అందించేందుకు చర్యలు చేపట్టిన జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మకు అభినందనలు తెలియజేసిన మంత్రి కాకాణి.
జిల్లా పరిషత్ భవనానికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దివంగత నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేరు పెట్టేలా ఆమోదించిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపుతామని ప్రకటించిన మంత్రి కాకాణి.