SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 28 at 2.43.37 PM

సాక్షిత : కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే పూర్తయిన తర్వాత, ప్రధాన ట్రాఫిక్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు రహదారికి మళ్లించబడిన, ఖమ్మం – అశ్వారావుపేట రహదారిని గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానించేందుకు సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో సరైన ఎగ్జిట్, ఎంట్రీ పాయింటు లేకపోవడంతో స్థానికంగా తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. కనుక కల్లూరు మండలం లింగాల వద్ద (కల్లూరు-వూటుకూరు రహదారిపై) మరియు వేంసూరు మండలం, లింగపాలెం, వేంసూరు శివారు (సత్తుపల్లి-విజయవాడ రహదారిపై) ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్లు ఇవ్వాలని,
అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పినపాక నుండి తల్లాడ టౌన్ వరకు, కల్లూరు టౌన్, పెనుబల్లి నుండి లంకపల్లి వరకు, కిష్టారం వై జంక్షన్ వద్ద నుండి సత్తుపల్లి టౌన్ లిమిట్స్ వరకు, సత్తుపల్లి పట్టణ శివారు నుండి గంగారం Y జంక్షన్ వరకు పోలీస్ శాఖ వారిచే 11 (బ్లాక్ స్పాట్లుగా) రోడ్డు ప్రమాద హెచ్చరికలుగా గుర్తించినందున సెంట్రింగ్ లైటింగ్ తో 4 లైన్ రోడ్ కు అనుమతులను,నిధులను మంజూరు చేయాలని క్రితంలో దరఖాస్తులను ఎంపీ నామ నాగేశ్వరావు ,

రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ల సిఫార్సుతో అందజేయగా సదరు ప్రతిపాదనపై రిపోర్టును తెలపాలని హైదరాబాదు నేషనల్ హైవేస్ రీజనల్ ఆఫీసుకు ఢిల్లీ జాతీయ రహదారుల శాఖ నుండి ఆదేశాలు రాగా అనుమతులు మంజూరుకు సానుకూలంగా తెలుపుతూ రిపోర్టును హైదరాబాద్ నేషనల్ హైవేస్ రీజినల్ ఆఫీస్ వారు ఢిల్లీ జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ కి పంపారని ప్రస్తుతం ఢిల్లీలో జాతీయ రహదారుల శాఖ వద్ద ఉన్న రిపోర్టును త్వరితీగతీన పరిశీలన చేసి మంజూరుకు నిధులను అనుమతులను మంజూరు చేయాలని కోరుతూ ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ ని రాజ్యసభ ఎంపీ లు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి తో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య కలసి వినతి పత్రాన్ని అందజేశారు.


SAKSHITHA NEWS