SAKSHITHA NEWS

4 ఎకరాలలో 3 కోట్ల 95 లక్షల రూపాయలతో, అత్యాధునిక హంగులతో, సకల సౌకర్యాలతో నిర్మించిన మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభోత్సవం చేసిన ఎంపీ రంజిత్ రెడ్డి , ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి తండా లో రూ. (395 లక్షలు) మూడు కోట్ల తొంబై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా నిర్మించిన మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ ను చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి , కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి , రాగం నాగేందర్ యాదవ్ ,మాజీ కార్పొరేటర్ సాయి బాబా మరియు GHMC అధికారుల తో కలిసి ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పేద ,మధ్యతరగతి ప్రజలకు అందరికి అందుబాటులో ఉండే విదంగా ,అన్ని హంగుల తో,సకల సౌకర్యాలతో నిర్మించడం జరిగినది అని, సర్వ హంగులతో నిర్మించిన మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. పాపిరెడ్డి కాలనీ లో రూ. (395 లక్షలు) మూడు కోట్ల తొంబై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయం తో ఇంచుమించు 4 ఎకరాల సముదాయంలో నూతనంగా నిర్మించిన మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ ను నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని ప్రజావసరాల దృష్ట్యా మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ ను అన్ని హంగులతో ,అదునుతంగా ప్రయివేట్ ఫంక్షన్ హాల్లకు దీటుగా నిర్మించడం జరిగినది అని ,పేద ,మధ్యతరగతి ప్రజలు పెళ్లి లు చేసుకోవడానికి ఇందులో పైన స్టేజి పక్కన రెండు గదులు ,దీపాలు ,విశాలమైన హాల్, అధునూతన టైల్స్ , పార్కింగ్ వంటి సకల వసతులతో నిర్మించడం జరిగినది అని,

ఈ ఫంక్షన్ హాల్ కాలనీ వాసులకు, చుట్టు పక్కల కాలనీ వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని కాలనీ అభివృద్ధి మరియు సమస్యల పై చర్చించుకోవడానికి చిన్న చిన్న సమావేశాలు, బర్త్ డే పార్టీలు ,వివాహాలు , పొదుపు సమాఖ్య మహిళా ప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అని, సభలు,సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా భవనం ఉపయోగపడుతుంది అని. అందరు కలిసి కాలనీ అభివృద్ధికి పాటు పడాలని,కాలనీ సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని,ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మొక్కలు నాటాలని అదేవిధంగా కాలనీ లలో తన దృష్టికి వచ్చిన .ఏ చిన్నసమస్యనైనా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయ షెక్తుల కృషి చేస్తానని , ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు .

ఈ కార్యక్రమంలో GHMC SE శంకర్ నాయక్, EE శ్రీనివాస్ AE సునీల్, వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్ ,ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఉద్యమకారులు,బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Image 2023 10 06 at 5.47.53 PM

SAKSHITHA NEWS