ఎమ్మెల్సీ రమణ మేనల్లుడి వివాహానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ తో కలసి హాజరైన ఎంపీ నామ నాగేశ్వరరావు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని జేడీ కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా శనివారం జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ మేనల్లుడు, పోరండ్ల శారద – పోరండ్ల ప్రభాకర్ ( లేటు ) కుమారుడి వివాహానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ తో కలసి హాజరై, నూతన వధూవరులు రాజీవ్ కుమార్ – శ్రావ్య లను రల్ అక్షింతలు వేసి, శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు. రమణతో నామ నాగేశ్వరరావుకు ఎప్పటి నుంచో ఎంతో అనుబంధం ఉంది. వారి కుటుంబంతో ఉన్న సత్ సంబంధం దృష్ట్యా ఎంపీ నామ కేటీఆర్ తో కలసి రాజీవ్ కుమార్ – శ్రావ్య వివాహానికి హాజరై, నూతన వధూవరులను దీవించారు. ఈ సందర్భంగా నామ ఇరు కుటుంబ సభ్యులతో మమేకమై, వారి సంతోషం లో పాలు పంచుకున్నారు. నామకు, కేటీఆర్ కు ఎమ్మెల్సీ రమణ కుటంబ సభ్యులు ఆత్మీయ సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు, ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.