SAKSHITHA NEWS

ట్రాఫిక్ నియమాలు పాటించక పోవడం వల్లే ఎక్కువ శాతం ప్రమాదాలు.*
రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలి.*
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ *

సాక్షిత జగిత్యాల జిల్లా… : ట్రాఫిక్ నియమాలు పాటించడం వల్లే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని, రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలి జిల్లా ఎస్పీ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఓల్డ్ బస్టాండ్ లో హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీని జిల్లా ఎస్పీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోంది అని పోలీస్ శాఖ ఎన్ని చర్యలు చేపట్టిన ప్రజలు కుడా భాగస్వామ్యం అయితేనే ప్రమాదాలను పూర్తిగా నివారించగలమని అన్నారు. జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో పరిది లో హెల్మెట్ ఆవశ్యకత, సీట్ బెల్ట్ ధరించడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ,డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడింగ్, డేంజరస్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ చేయడం, లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్ టేక్ చేయడం వీటి పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింద అని అన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా స్థాయిలో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో డిస్టిక్ రోడ్ సేఫ్టీ బ్యూరో ని ప్రారంభించి ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఈ విభాగం పరిశీలించి రోడ్డు ప్రమాదాలకు గల కారణాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలు పై ఈ విభాగం అధికారులు నివేధిక అందజేస్తారని అన్నారు. జిల్లా లో ఉన్న 44 బ్లాక్ స్పాట్స్(ప్రమాదాలు అధికముగా జరుగు ప్రదేశాలు) ను పంచాయతీ రాజ్ మరియు ఆర్&బి ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రమాదాల నివరణ పై దృష్టి సారిస్తునామని అన్నారు. వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో వీలైనంతవరకు తక్కువ వేగంతో వాహనాలు నడపాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నియమాలను పాటించి ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.

ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్ లను ఇచ్చారు.

ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పీ రఘు చందర్, , టౌన్ ఇన్స్పెక్టర్ వేణు గోపాల్ , ఎస్. ఐ లు తిరుపతి, సుదీర్ రావు ట్రాఫిక్ ఎస్. ఐ లు రామచంద్ర౦,మల్లేష్ , ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Image 2024 07 31 at 18.37.28

SAKSHITHA NEWS