ఉమ్మడి కృష్ణ జిల్ల
దోమలు బాబోయ్ దోమలు
దవాఖానల్లో ప్రజలు
తిరువూరు నగర పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి పట్టణంలో విజృంభిస్తున్న దోమల నివారణ కొరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి ఇటీవల కురిసిన వర్షాల వల్ల మురుగు నీరు పారుదల లేక ఎక్కువగా వెనకబడిన ప్రాంతాలు నీటి నిల్వలు ఏర్పడి దోమలు అభివృద్ధి చెందుతున్నాయి పట్టణమంతా టైఫాయిడ్,మలేరియా విష జ్వరాలతో పాటు వైరస్ బారిన పడి ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు
. దోమల నివారణ కొరకు వెంటనే అధికారులు స్పందించి తగుచర్యలు తీసుకోవాలి. దోమల బారి నుండి రక్షణ కొరకు ప్రజలను చైతన్య పరిచే అవగాహన కార్యక్రమాలు అధికారులు చేపట్టాలి
. అధికారుల పర్యవేక్షణలోపం నగర ప్రజలకు శాపంగా మారిందని నగర పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపం తోపాటు మురుగునీరుపారుదల అస్తవ్యస్తంగా ఉందని అధికారులు వెంటనే పర్యవేక్షించి సమస్యను పరిష్కరించాలి