జగ్గయ్యపేట మండలం ఐసిడిఎస్ చిల్లకల్లు ప్రాజెక్టు పరిధిలో గల సుమారు 267 అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణ ఐదు రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా జీతాల పెంపు,వర్క్ లోడ్,పలు యాప్ ల వల్ల ఇబ్బందులు, పెండింగ్ అద్దెల బిల్లులు పలుడిమాండ్ల సాధన కోసం అంగన్వాడీల యూనియన్ పిలుపు మేరకు అంగన్వాడీ కార్యకర్తలు,ఆయాలు అంగన్ వాడీ కేంద్రాలకు తాళాలు వేసి సమ్మెను కొనసాగిస్తూనే ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికి ప్రధాన డిమాండ్లు పరిష్కారం కాకపోవడంతో సమ్మెను కొనసాగిస్తున్నారు.దీనితో ఆగ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ, మండలం పరిషత్, సచివాలయoలు, అంగన్వాడీ అధికారుల పర్యవేక్షణలో పంచనామా చేసి అంగన్వాడీ కేంద్రాలకు వేసిన తాళాలను పగులగొట్టి తెరవడం జరిగింది.
ఇప్పటికే చిల్లకల్లు ప్రాజెక్టు పరిధిలో చాలా అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు లేకుండా కేంద్రాలను అధికార బలంతో తెరవ్వడం జరిగింది.
అంగన్వాడీ కేంద్రాలలో ఉండే సరుకులు,వస్తు సామగ్రీలు పోతే ఎవ్వరు బాధ్యత వహిస్తారని, యస్.హెచ్.సి గ్రూపుల వారు ఉచితంగా వండి చేసే పరిస్థితులు ఎన్ని రోజులు చేస్తారని పలువురు వాదిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వo తీరుతో స్థానిక నాయకులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ప్రజలు సైతం ఇటువంటి దుర్మార్గపు తీరును ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో ఇటువంటిది ఎప్పుడు చూడలేదని,మహిళలైన అంగన్వాడీల పై ఉక్కుపాదం సరైంది కాదని నాయకులు, మేధావులు,ప్రజలు వాదిస్తూ పలువురు మద్దతునిస్తున్నారు.
ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడి అంగన్వాడీ కోర్కెలను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ పార్టీ జగ్గయ్యపేట నియోజకవర్గ కార్యదర్శి అంబోజి. శివాజీ, సిపిఐ పార్టీ పట్టణ అధ్యక్షులు జూనెబోయిన శ్రీనివాసరావు, సిపిఐ బృందం వారికి మద్దతు నిచ్చి ప్రభుత్వాని డిమాండ్ చేశారు..