MLC Padi Kaushik Reddy should work for the construction of Muslim Shaadi Khana
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని సర్వేనెంబర్ 629 లో ముస్లింల షాదీ ఖానా కొరకు కేటాయించిన స్థలములో ముస్లిం షాది ఖాన నిర్మాణం కొరకు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కృషి చేయాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కోరారు
జమ్మికుంట పట్టణం సర్వేనెంబర్హుస్సేన్ 629 స్థలములో ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలో ముస్లింల షాదీఖానా లేక నిరుపేద ముస్లింల బాలికల పెళ్లిళ్లు చేయాలంటే చాలా ఖర్చు వస్తుందన్నారు జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వం పరంగా ముస్లింల షాదీ ఖానా నిర్మాణం చేపట్టినట్లయితే నిరుపేద బాలికల పెళ్లిళ్లు షాదిఖానాలో చేసుకున్నట్లయితే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండవని అన్నారు జమ్మికుంట పట్టణ ముస్లింలను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట పట్టణ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు చొరవ తీసుకొని జమ్మికుంట పట్టణంలో సర్వేనెంబర్ 629 లో షాదీ ఖానా భవన నిర్మాణం కొరకు ప్రభుత్వం ద్వారా కోటి రూపాయలను మంజూరు చేయించి అన్ని హంగులతో ముస్లిం షాది ఖానా నిర్మాణం కొరకు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు ఉప ఎన్నిక సందర్భంగా ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఎస్సీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హోం శాఖ మంత్రి మహమ్మద్ మహిముద్ అలీ తోపాటు ఇతర నాయకుల సమక్షంలో జమ్మికుంట పట్టణ ముస్లిం షాది ఖానా కొరకు 50 లక్షల రూపాయలను మంజూరు హరీష్ రావు ప్రకటించారని.
తెలిపారు హుజురాబాద్ నియోజకవర్గం లో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కొరకు వారి అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేస్తున్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చొరవ తీసుకొని జమ్మికుంట పట్టణంలో ముస్లింల షాదీఖానా నిర్మాణం కొరకు కృషి చేయాలని. కోరారు జమ్మికుంట మండలం చుట్టుపక్క ప్రాంతాల ముస్లింల పక్షాన హుజురాబాద్ డివిజన్ మజీద్ ఈద్గా కబ్రుస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ జనరల్ సెక్రెటరీ మహ్మద్ ఫసి అసోసియేట్ అధ్యక్షులు మొహమ్మద్ జాకీర్ మహమ్మద్ ఇస్మాయిల్ మహ్మద్ రఫీ మహమ్మద్ అక్బర్ సయ్యద్ అబ్దుల్ అజీమ్ తదితరులుఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట పట్టణం మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు తో పాటు పాలకవర్గానికి విజ్ఞప్తి చేశారు.