ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ నిరాశే
న్యూ ఢిల్లీ :
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది.
ఈ స్కామ్‌కు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణ లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ,అరెస్ట్ చేసిన కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్‌ను ట్రయల్ కోర్టు మరోసారి పొడిగించింది.
ఆగస్ట్ 13 వరకు జ్యూడిషి యల్ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవితను ఈ ఏడాది మార్చి 16న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఈడీ కేసులో ఇవాళ్టితో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో అధికారులు వర్చువల్‌గా ఆమెను న్యాయస్థానంలో హాజరు పర్చారు.
కేసు విచారణ కీలక దశలో ఉన్నదని.. ఈ సమయంలో కవిత కస్టడీని పొడగించా లని ఈడీ తరుఫు లాయర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కవితకు మరో 14 రోజుల జ్యుడిషి యల్ రిమాండ్ విధించింది.