MLA’s special focus on public issues
ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.