SAKSHITHA NEWS

MLA who started the free health camp

ఉచిత ఆరోగ్య శిబిరంను ప్రారంభించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని గాంధీనగర్ కమిటీ హాల్ లో రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ మరియు నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రి వారి సహకారంతో స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరంను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో క్యాన్సర్ స్క్రీనింగ్, మమో గ్రఫీ, హృదయ సంబంధిత వ్యాధులకు 186 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేదలకు ఉచిత ఆరోగ్య సేవలు అందించేందుకు ముందుకొచ్చిన సంస్థలను ఎమ్మెల్యే అభినందించారు.

ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు రవి, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీదేవి, నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రి మేనేజర్ వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకుడు రాఘవులు, వివేకానంద యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు జల్దా లక్ష్మీనాథ్, వెంకట సాయి, సాయి గౌడ్, ఎల్లయ్య, లక్ష్మణ గౌడ్, పద్మ, కమలబాయి, తిమ్మయ్య, సతీష్ గట్టోజీ, కార్తిక్ గౌడ్, మురళి, దత్తు, కిరణ్, సందీప్, ఆనంద్, సోను, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS