MLA who reviewed SNDP Nala’s work with officials
ఎస్ఎన్డిపి నాలా పనులు అధికారులతో పరిశీలించిన ఎమ్మెల్యే…
పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం…
సాక్షిత ; కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని గోదావరి హోమ్స్ లో ఎస్ఎన్డిపి ఆధ్వర్యంలో చేపడుతున్న వర్షపు నీటి నాలా నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ మేరకు కాలనీ వాసులకు ఇబ్బందులు లేకుండా పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అదే విధంగా భూగర్భ డ్రైనేజీ, మంచినీటి లైన్ కు ఇబ్బందులు లేకుండా తిరిగి పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్డిపి డిఈ నరేందర్, ఏఈ రామారావు, వాటర్ వర్క్స్ జీఎం శ్రీధర్ రెడ్డి, డిజీఎం రాజేష్, ఏఈ సురేందర్ నాయక్, కాలనీ జనరల్ సెక్రెటరీ మాధవ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.