SAKSHITHA NEWS
MLA who reviewed our government's program for Gadapa Gadapa

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి *


సాక్షిత : గత 5 నెలలుగా నిర్విరామంగా జరుగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట పట్టణంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్ లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నరసరావుపేట మున్సిపాలిటీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన వార్డుల వారీగా ఈ సమీక్ష సమావేశం జరిగింది.

వార్డ్ లలో ప్రతిపాదించిన పనులు, వాటి ప్రస్తుత పరిస్థితిపై ఎమ్మెల్యే ఆరా తీశారు. సచివాలయంకు రూ. 20 లక్షలు మంజూరవుతున్న తరుణంలో పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. అలాగే నాణ్యతలో రాజీ కూడా పడకూడదు అని స్పష్టం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో హౌసింగ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా గృహ నిర్మాణాలు జరిగేలా .. లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి అన్నారు.

నరసరావుపేట పట్టణంలో రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు, మంచినీరు, విద్యుత్ దీపాల ఏర్పాటుతో పాటు పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళడానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దోహదపడుతుంది అన్నారు. సచివాలయం సిబ్బంది కూడా అలసత్వం వహించకుండ పనులు త్వరగా పూర్తి చేసేలా చూడాలని ఆదేశించారు*

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర , డీఈ శ్రీనివాస రావు , ఎంఈ దాసరి శ్రీనివాస రావు , వార్డుల ఇంఛార్జిలు, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు