ప్రజాభవన్ – 08-10-2024
భద్రకాళి బండ్ పై ఎమ్మెల్యే నాయిని…
వాకర్స్ తో కలిసి బండ్ మొత్తం పరిశీలించిన ఎమ్మెల్యే…
నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలనీ అధికారులకు ఆదేశాలు…
భద్రకాళి చెరువు, బొంది వాగు నాలా పరిశీలన,గుఱ్ఱెపు డెక్క తొలగింపు పై త్వరిత చర్యలకు ఆదేశాలు…
హంటర్ రోడ్డు /వరంగల్,
తేదీ : 08/10/2024-మంగళవారం.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 31వ డివిజన్ న్యూ శాయంపేట భద్రకాళీ బండ్ పై వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పర్యటించారు ఉదయం వేళ వాకర్స్ తో కలిసి భద్రకాళి బండ్ ఆవరణ మొత్తం పరిశీలించారు.బొంది వాగు నాలా డైవర్షన్ పై ప్రత్యామ్నాయ మార్గం చేయాలనీ తెలిపారు. నగర ప్రజలకు ఆహ్లాదకరమైనా వాతావరణం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామాని చెరువులను అక్రమణకు గురికాకుండా చూడాల్సిన అవసరం ప్రజలపై కూడా ఉన్నదని తెలిపారు. భద్రకాళి బండ్ సుందరికారణ పనులు వేగవంతం చేయాలని, భద్రకాళి చెరువు పరిసరా ప్రాంతం ఆక్రమణకు గురికాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భద్రకాళి చెరువులో గుర్రపు డెక్క తక్షణమే అధికారులు అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు బతుకమ్మ పండుగ సమీపించిన వేళ భక్తుల గెటటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు.వాకర్స్ తో సరదాగా ముచ్చటించారు.అనంతరం 31 వ డివిజన్ కనక దుర్గా కాలనీలోని కనక దుర్గ దేవాలయం అభివృద్ధి లో భాగంగా రోడ్లను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు,మాజీ కార్పొరేటర్ శివశంకర్, డివిజన్ అధ్యక్షులు సురేందర్ మరియు స్థానిక కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.