MLA who distributed Christmas gifts in Subhash Nagar division
సుభాష్ నగర్ డివిజన్ లో క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని లాస్ట్ బస్టాప్ బెరెన్ బాపిస్ట్ చర్చ్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగ సందర్భంగా అందిస్తున్న క్రిస్మస్ కానుకలను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు
. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అధికారికంగా పండుగలను నిర్వహిస్తుందని, అందుకే పేద కుటుంబాల్లో ఆనందం కోసం కానుకలు అందిస్తుందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.
తెలంగాణ పథకాలను కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తంగ లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు మహ్మద్ మక్సూద్ అలీ, యావన్నసంతోష్ రెడ్డి, అడప శేషు, నాగిరెడ్డి, పద్మజ రెడ్డి, పద్మలత రెడ్డి, ఇస్మాయిల్, రాజ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, పాస్టర్లు ఎలిఫస్, శిఖామణి తదితరులు పాల్గొన్నారు.