ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తాం
పచ్చపచ్చని గద్వాల
కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే గారు
గద్వాల నియోజకవర్గం లోని ధరూర్ మండల పరిధిలోని ర్యాలంపాడు రిజర్వాయర్ ప్రత్యేక పూజలు నిర్వహించి
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చేతుల మీదుగా మోటార్లను ఆన్ చేశారు నీళ్లను విడుదల చేయడం జరిగినది.
వైస్ ఎంపీపి ఎమ్మెల్యే కి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు .
గత వారం రోజులుగా నెట్టెంపాడు, కుడి ఎడమ కుడి నీళ్లు విడుదల చేయడం జరిగింది జూరాల ఎగువ ప్రాంతంలో బారీ వర్షాలు పడటంతో జూరాలకు వస్తున్న వరద ను దృష్టిలో పెట్టుకుని జూరాల బ్యాక్ వాటర్ నుంచి
నెట్టెంపాడు ప్రాజెక్టు ఎత్తిపోతల ద్వారా సాగు నీరందించడానికి పంపు మోటార్లను ఆన్ చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ*
జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గుర్తుచేశారు .
గత సంవత్సరం భారీ వర్షాలు పడి జూరాల నిండుకుండలా మారిందని, జూరాల జళాశయం నుంచి రిజర్వాయర్లను పూర్తి స్థాయి లో నింపినట్లు పేర్కొన్నారు.
రిజర్వాయర్ల కాలువల ద్వారా ప్రతి గ్రామంలో ఉన్న చెరువులు, కుంటలు నింపడమే కాక ప్రతి ఎకరాకు సాగునీరందించామని తెలిపారు.
గత యేడాది నడిగడ్డలో రెండు పంటలకు పుష్కలంగా పండి రైతుల ఇంట సిరిపిలు కురిపించాయని, రైతు ఆనందంలో మునిగి తేలాడన్నారు.
నాలుగు టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు ప్రస్తుతం రెండు టీఎంసీలు మాత్రమే నీటిని నిలువ ఉంచడం జరుగుతుంది. ఈ రిజర్వాయర్‌లో కొంత నీటి లీకేజీ సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం దృష్టికి నివేదిక ప్రతిపాదించడం జరిగింది. ప్రభుత్వం కూడా నీటి సమస్యలను లీకేజీ నీటి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుంది. సంవత్సరం లోపు ఈ సమస్యలను పరిష్కరించి రైతులకు నాలుగు టి ఎంసిల నీటిని అందించి రెండు పంటలు కు చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. త్వరలోనే గట్టు ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసుకొని రైతులకు నీళ్లు అందించే విధంగా కూడా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఖరీఫ్ సీజన్ లో రైతులు సాగు చేసిన పంటలకు సాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణలో రైతు సంక్షేమానికే కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, రైతు బాగున్నప్పనీరందిస్తాం రైతు రాజ్యం సాధ్యం అవుతుందని అన్నారు
కరోనా కష్ట సమయంలో కూడా రైతులకు అండగా రైతుకు రైతుబంధు ద్వారా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగినది.
రైతులు కూడా అధికారులకు సహకరించాలి రైతులు నీటిని వృధా చేయరాదు. వారక్రమ బద్ధులు నీటిని విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ విషయాన్ని గ్రహించాలి అవసరాన్ని బట్టి నీటిని ఉపయోగించుకోవాలి మన ప్రాంతంలో వర్షపాతం తక్కువ నమోదు కావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతు సన్న కారు రైతుకు కూడా మీరు అందించే విధంగా సమన్వయంతో అధికారులు కృషి చేయాలని సూచించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పధకాలను ప్రవేశ పెడుతూ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నారని చెప్పారు.
ఈ రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, పథకాల తో రాష్ట్రవ్యాప్తంగా వేల రైతులు కుటుంబాల్లో వెలుగు నింపిన ఘనత కూడా సీఎం కేసీఆర్ దే అని గర్వంగా చెప్పారు. .
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, జడ్పిటిసి రాజశేఖర్ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, సర్పంచ్‌లు కర్రెమ్మ , మహబూబ్, మండలం రైతు బంధు సమితి అధ్యక్షుడు ఈశ్వరయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, సర్వా రెడ్డి, శ్రీరాములు, భీమ్ రెడ్డి, విజయ్ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, హనుమంతు రెడ్డి, నాగన్న, మండలం పార్టీ యూత్ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, ఉపాధ్యక్షుడు జాంపల్లి భరతసింహా రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.