SAKSHITHA NEWS

మోటూరు గురుకుల పాఠశాలను …. ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

తరగతుల వారిగా విద్యార్థినీలతో మాట్లాడిన ఎమ్మెల్యే….. సదుపాయాలపై ఆరా

మంత్రి లోకేష్ ఆలోచనలతో విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు…

బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలంటూ, విద్యార్థినీలకు ఆశీస్సులు అందించిన ఎమ్మెల్యే రాము….

గుడివాడ రూరల్ గుడివాడ రూరల్ మండలం మోటూరులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ చేశారు.

ముందుగా గురుకుల పాఠశాల పరిసరాలను పరిశీలించిన ఎమ్మెల్యే రాము…. తరగతుల వారీగా తిరుగుతూ విద్యార్థినిలతో నేరుగా మాట్లాడారు… వసతి గృహంలో మెనూ….ఇతర వసతులపై ఎమ్మెల్యే రాము ఆరా తీశారు.

డిజిటల్ బోర్డుల ద్వారా అధ్యాపకులు అందిస్తున్న బోధనలను విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే ఆసక్తిగా విన్నారు. ప్రతి తరగతి గదికి ఉత్సాహంగా తిరిగిన ఎమ్మెల్యే రాము విద్యార్థినిలతో కొద్దిసేపు ముచ్చటించారు. బాగా చదువుకోనీ ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థినిలకు ఎమ్మెల్యే ఆశీస్సులు అందించారు.

అనంతరం గురుకులం వసతిగృహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే… అక్కడి పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేసి…. పరిస్థితులను చక్కదిద్దాలంటూ ప్రిన్సిపాల్ సంజీవిని దేవినీ సున్నితంగా హెచ్చరించారు. హెల్త్ సూపర్వైజర్ తో మాట్లాడుతూ విద్యార్థినిల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సమస్యలు తలెత్తితే సమీపంలోని మండల పిహెచ్సి వైద్యల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

తనిఖీలలో భాగంగా విద్యార్థినీలకు అందించే మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించిన ఎమ్మెల్యే రాము… ఆహారాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. తనిఖీలలో భాగంగా గుర్తించిన పలు అంశాలను… చక్క దిద్దుకోవాలంటూ ప్రిన్సిపల్ కు ఎమ్మెల్యే రాముపల్లి సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోనీ విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయన్నారు. విద్యా వ్యవస్థ అభివృద్ధికి మంత్రి లోకేష్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగానే వసతి గృహాల్లో విద్యార్థులకు సదుపాయాలు అందేలా అధికారులు దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే రాము సూచించారు. నియోజకవర్గంలోని వసతి గృహాల్లో సమస్యలు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని…. సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు.

ఈ తనిఖీలలో మండల ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు, మోటూరి పంచాయతీ కార్యదర్శి పి.జనార్ధన్, టిడిపి నాయకులు చేకూరు జగన్ మోహన్ రావు, మోటూరు శేషగిరి, కటారి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.