MLA stands with the poor family.
నిరుపేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే…
ఇంటి పైకప్పు కూలడంతో తక్షణమే రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేత…
*సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో నివాసముంటున్న అంజమ్మ ఇంటి పైకప్పు నిన్న మధ్యాహ్నం ప్రమాదవశాత్తు కూలింది. అదే సమయంలో నిద్రిస్తున్న చిన్నారికి తృటిలో ప్రమాదం తప్పింది.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అక్కడికి వెళ్లి నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు. మానవతాదృక్పథంతో స్పందించి తక్షణమే రూ.50 వేలు ఆర్థికసాయాన్ని అంజమ్మకు అందజేశారు. త్వరలోనే ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం అంజమ్మ కుటుంబ సభ్యులు, భగత్ సింగ్ నగర్ వాసులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తంగ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ భగత్ సింగ్ నగర్ బస్తీ ప్రెసిడెంట్ సామ్రాట్, నాయకులు,
ఉప్పలయ్య, లక్ష్మణ్, ప్రభాకర్, అశోక్, జిల్లా వెంకటేష్, పంగ రాజు, వరదరాజు, సుభాష్, చందు, శ్రీధర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, బస్వరాజు, మూర్తి, బీసు వెంకటేష్ గౌడ్, రమేష్, రాము, జాంగిర్, బాబు రావ్, నరేష్, రాఘవేంద్ర, అభిలాష్, మహిళా నాయకురాలు లక్ష్మమ్మ, నర్సమ్మ, సుబ్బమ్మ, ప్రమీల, వసంత, మేఘమాల, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.