రైతు నగరంలో 35 లక్షల రూపాయలతో నూతన సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి.
సాక్షిత నంద్యాల జిల్లా
నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు రైతు నగరం నందు కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 35 లక్షల రూపాయలతో నూతన గ్రామ సచివాలయాన్ని నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియుమ్మెల్సీ ఈషాక్ బాషా, మార్క్ఫెడ్ చైర్మన్ పి పి నాగిరెడ్డి, నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ , వైయస్ఆర్సిపి నాయకులు రామసుబ్బారెడ్డి మరియు రైతు నగరం వైసిపి నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి మంచి అవకాశం ఉందన్నారు అలాగే కొన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా సచివాలయాలు నిలిచాయని గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యాన్ని ప్రజలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నంద్యాల నియోజకవర్గ ప్రజల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానుఅన్నారు