మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కాజా గ్రామంలో పుల్లయ్య నగర్ వద్ద సుమారు 15 మీటర్ల పొడవుతో, 5 మీటర్ల వెడల్పుతో సుమారు 20 లక్షల రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మాణం జరుగుతున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆర్కే కార్పొరేషన్ కమిషనర్ మరియు కార్పొరేషన్ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది.
రోడ్డు నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి నాణ్యత ప్రమాణాలతో రోడ్డు నిర్మించాలని ఎమ్మెల్యే ఆర్కే కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచనలు చేశారు.
కాజా, పుల్లయ్య నగర్ వాసులు ఎంతోకాలంగా సరైన రోడ్లు, డ్రైనేజీలు లేక పుల్లయ్య నగర్ నందు ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడ్డామని ఎమ్మెల్యే ఆర్కే రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు తమ సమస్యలను వారితో చెప్పుకోగా ఎమ్మెల్యే వెంటనే కాజా పుల్లయ్య నగర్ లో అన్ని రోడ్లు నిర్మించడం, త్రాగునీటి సౌకర్యం కల్పించడం జరిగిందని, అందుకు ఎమ్మెల్యే ఆర్కే కి పుల్లయ్య నగర్ వాసులు ధన్యవాదాలు తెలియజేశారు.