MLA participated in National Road Safety Week
జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
నీ మీద మీ జీవితమే కాదు,మీ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల సంతోషం కొరకు ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించండి – MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి
జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా పట్టణం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్ద రవాణా మరియు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వారోత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి .
ముందుగా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఎమ్మెల్యే రవాణా మరియు పోలీస్ శాఖ వారితో అలాగే పట్టణ వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి హెల్మెట్ ధరించి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు.అతివేగం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాహన దారులు వేగం తగ్గించాలని సూచించారు.ప్రతీ ద్విచక్రవాహన దారుడు హెల్మెట్ తప్పని సరిగా కలిగి ఉండాలని అలాగే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు.
మీకోసం మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారని కావున మీ కుటుంబ సభ్యుల సంతోషం కొరకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా బైక్ నడుపుతూ హెల్మెట్ ధరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,DSP విశ్వనాధ్,మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు,సర్కిల్ ఇన్స్పెక్టర్లు అజయ్ కుమార్,విక్రమ్,జిల్లా వక్ఫ్ బోర్డు ప్రెసిడెంట్ సిరాజ్,బోర్డు మెంబర్ మున్న రాయల్,ఆర్కార్డ్ శంకర్,నాని, సునీత సింగ్,పులి రామచంద్ర,శ్రీవారి సురేష్,ఫజల్, మురళీకృష్ణ రెడ్డి, రవి,జయరామయ్య, దాము,భవాజి,మనీ,బాబు,చిట్టి, అలాగే రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ వారు పాల్గొన్నారు.