వైద్య సాయానికి నిత్యం సిద్దం : ఎం ఎల్ ఏ పద్మారావు గౌడ్
.
సికింద్రాబాద్ : నిరుపేదలకు వైద్య సాయాన్ని అందించేందుకు తాము నిరంతరం సిద్దంగా ఉంటామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం లోని శ్రీనివాస్ నగర్ కు చెందిన స్టాలిన్, వారాసిగుడా కు చెందిన బీ పాషా లు అనారోగ్యం బారిన పడి వైద్య సాయానికి సితాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయాన్ని ఆశ్రయించారు. వెంటనే ఎం.ఎల్.ఏ. తీగుల్ల పద్మారావు గౌడ్ చొరవ తీసుకొని వారికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.రెండు లక్షల చొప్పున రూ.నాలుగు లక్షల మేరకు ఎల్.ఓ.సీ. పత్రాలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సమకూర్చి గురువారం తన కార్యాలయంలో అందింజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు తమ సితాఫలమండీ లోని తమ కార్యాలయం బాసటగా నిలుస్తుందని తెలిపారు. గత పదేళ్ళ కాలంలో రికార్డు సంఖ్యలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పేదలకు అందించామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
వైద్య సాయానికి నిత్యం సిద్దం : ఎం ఎల్ ఏ పద్మారావు గౌడ్
Related Posts
డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు
SAKSHITHA NEWS డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్‌ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ…
షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు
SAKSHITHA NEWS షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్…