SAKSHITHA NEWS

న్యూ చిట్యాలలో ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు పంపిణీ

పేదవాళ్లకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగుతోందని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. బెల్లంకొండ మండలం న్యూ చిట్యాలలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డుల పంపిణీని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. పేదవాడి ఆరోగ్యానికి భరోసా కల్పించే దిశగా మొదట ఆలోచన చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. పాదయాత్రలో పేదవాళ్ల వైద్యఖర్చులపై చెప్పిన ఆవేదన నుంచి ఆరోగ్య శ్రీ పుట్టిందన్నారు. వైఎస్ మనసులో పుట్టిన ఆలోచన ఎంతోమంది పేదల జీవన ప్రమాణాలను పెంచిందన్నారు. తర్వాతి ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీని నీరుగార్చి పేదవాడికి వైద్యం అందని ద్రాక్షగా మార్చారని మండిపడ్డారు. 2019లో వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి కాగానే ఆరోగ్యశ్రీ పరిధిని పెంచి రూ.5 లక్షలు చేశారన్నారు.

మరిన్ని రకాల వైద్యసేవలను ఆరోగ్యశ్రీలో చేర్చారన్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఖర్చును రూ.25 లక్షలకు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. జగనన్న నిర్ణయంతో దీర్ఘకాలిక వ్యాధులు, పేదలు ఖర్చు భరించలేని వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందుతోందన్నారు. గ్రామగ్రామన హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునికీరణ, ప్రతి మండలంలో ప్రభుత్వాస్పత్రులు, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీల ఏర్పాటు వంటి సంచలన నిర్ణయాలతో పేదవాళ్ల పాలిట జగనన్న దేవుడిగా మారారన్నారు. కార్యక్రమం అనంతరం పులిచింతల నిర్వాసితుల కోసం ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తూ జీవో తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. న్యూచిట్యాల తండా వాసులు ఎమ్మెల్యే ని శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.


SAKSHITHA NEWS