వైయస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద పేదలకు ఉచితంగా వైద్యం అందజేస్తున్నారని,ఈ పథకం పేదల పాలిట వరం అని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. ఈనెల 18వ తేదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా మెగా ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈరోజు క్రోసూరు లో ఎమ్మెల్యే కార్యాలయంలో బ్రోచర్ ను ఆవిష్కరించారు.
సుమారు 2400కు పైగా వ్యాధులకు ఆరోగ్యశ్రీ అందించడం జరుగుతుందని, సంవత్సరానికి వెయ్యి రూపాయల నుండి 25 లక్ష రూపాయల వరకు ఖర్చు అయిన వైద్యం పూర్తిగా ఉచితంగా అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.