ఎమ్మెల్యే మాట బే ఖాతరు
సాక్షిత:- అభిజిత్ ఫెర్రో ఎల్లోయిస్ కంపెనీ లే ఆఫ్ ఎత్తివేసినట్లు ఎమ్మెల్యే ప్రకటించడంతో కార్మికులందరూ డ్యూటీలు హాజరయ్యారు. కానీ కంపెనీ యజమాన్యం లే ఆఫ్ ఎత్తి వేస్తున్నట్లు నోట్ బోర్డ్ తీసివేయడం గాని, కార్మికులు డ్యూటీ లకు పంపలేదు. దీనితో దిక్కుతోచని స్థితిలో కార్మికులు గేట్ బయట ఉండిపోయారు. ఈ సందర్బంగా సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే మాటలు కూడా యాజమాన్యం బేఖాతారు చేయకపోవడం ఏమిటి అని ప్రశ్నించ్చారు.
కార్మికులు 25 రోజులు గా రోడ్డు మీద ఉంటే ప్రభుత్వం, అధికారులు యాజమాన్యం మీద చర్య తీసుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. తక్షణమే అభిజిత్ యాజమాన్యం కార్మికులకు బోనసు జీతాలు చెల్లిoచాలని చేయాలని డిమాండ్ చేశారు. చట్ట విరుద్ధంగా ప్రకటించిన లే ఆఫ్ ను ఎత్తివేసి కార్మికులకు పనులు కల్పించాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రొంగలి రాము, గనీశెట్టి సత్యనారాయణ, కుండ్రపు సోమినాయుడు తదితరులు పాల్గొన్నారు