సాక్షిత : కూకట్ పల్లి నియోజక వర్గంలోనీ ఓల్డ్ బోయిన్ పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రెండవ రోజు పాదయాత్ర నిర్వహించారు…ఈ కార్యక్రమంలో
కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్,జిహెచ్ఎంసి అధికారులు, పాల్గొన్నారు…ఈ నేపధ్యంలో..శ్రీ సాయి ఎన్ క్లేవ్..ముస్లిం బస్తీ.. యాదవ్ బస్తీ…హరిజన బస్తీ…మల్లికార్జున్ నగర్..మొదలగు ప్రాంతంలో పాద యాత్ర చేసి ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బ తిన్న ..రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ కు సంబంధించి ప్రజలు వద్ద కు వెళ్లి నేరుగా సమస్యలు తెలుసుకుని అక్కిడీ క్కక్కడే సమస్య పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు…
అంతేకాకుండా ప్రజలు తెలిపిన నీరు కలుషితానికి సంబంధించి వివరణ ఇచ్చారు… భారీ వర్షాల వల్ల మురుగునీరు రిజర్వాయర్లకు చేరడం వల్ల దాన్ని శుద్ధి చేయడానికి బ్లీచింగ్ తో నీరు శుద్ధి చేయడంతో ఆ విధంగా రంగు వస్తుందని తెలిపారు.. కొన్ని రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందని దీనికి ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు..
ఈ సందర్భంగా
పాదయాత్ర చేయడం వల్ల ప్రజా సమస్యలు దృష్టికి వస్తున్నాయి – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు..
వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యలు సత్వరమే పరిష్కరిస్తాం అని అన్నారు…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాన సమస్యలు పూర్తి చేశాం అని
ఏనాడు కూడా ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి నియోజక వర్గంలో కనపడలేదు అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు..