కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 129 సూరారం పరిధిలో లక్ష్మి నగర్ కాలనీ లో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 111వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అనంతరం పూర్తి చేసిన సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. అక్కడక్కడా మిగిలి ఉన్న పనులు తెలుసుకొని వాటిని త్వర తగినగా వ్యయప్రణాళికలు సిద్ధం చేసి ప్రజలకు అసౌకర్యం లేకుండా వాటిపై వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కాగా గతంతో పోల్చితే తమ కాలనీ లో మెరుగైన సౌకర్యాలు కల్పించి అన్ని రంగాల్లో అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే కి ప్రజలు ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో కేటీఆర్ సహకారంతో నియోజకవర్గం లో తాము చేసిన అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి మిగిలి ఉన్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే విదంగా పనిచేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో ఆపరటివ్ సొసైటీ చైర్మన్ మన్నే రాజు, డివిజన్ అద్యేక్షులు పుప్పాల భాస్కర్, జనరల్ సెక్రటరీ సిద్దిక్, సీనియర్ నాయకులు మన్నే బాలేష్,రాఘవ రెడ్డి, ఇంద్రసేన గుప్త, శ్రీనివాస్ రెడ్డి,సంపత్, అత్తిరి మారయ్యా, రహ్మాన్, సురేష్ బాబు,చంద్ర శేకర్ రెడ్డి,పందిరి యాదగిరి, అమృత, సాయి గౌడ్, సాజిద్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు..