నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్ లో పాదయాత్ర…
రూ.2.92 కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ 8వ డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 85వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి , డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ , కమిషనర్ రామకృష్ణ రావు , కార్పొరేటర్ సురేష్ రెడ్డి తో కలిసి పాదయాత్ర చేశారు. ఇందులో భాగంగా రూ.రూ.2.92 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు. రూ.2.18 కోట్లతో ఈశ్వర్ విల్లాస్ నుండి వర్టిక్స్ క్లబ్ హౌస్ వరకు వర్టిక్స్ నుండి అంబీర్ లేక్ వరకు నూతనంగా చేపడుతున్న ఎస్.ఎన్.డి.పి నాలా నిర్మాణ పనులకు, రూ.42.11 లక్షలతో ఓపెన్ నాలా డోమ్, ఎంఎస్ పైప్, జీఐ శీటింగ్ మరియు సీసీ రోడ్లు, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం పుష్పక్ అపార్ట్మెంట్ వద్ద రూ.20 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన మోడర్న్ బస్ స్టాప్, సీసీ కెమెరాలు, రూ.12 లక్షలతో ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. మిగిలి ఉన్న పనులు తెలుసుకొని అక్కడే ఉన్న అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. వాటిని త్వరలోనే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కాలనీల ప్రజలు పాల్గొన్నారు.