SAKSHITHA NEWS

ప్రగతి యాత్ర’లో భాగంగా 33వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
సుభాష్ నగర్ ఫేస్-1, భాగ్యలక్ష్మి కాలనీలలో పాదయాత్ర…
రూ.13.20 కోట్ల అభివృద్ధి పనులు పూర్తి చేసినందుకు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 33వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా సుభాష్ నగర్ ఫేస్-1, భాగ్యలక్ష్మి కాలనీలలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా సుభాష్ నగర్ ఫేస్-1లో రూ.8.70 కోట్లతో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పూర్తి చేసినందుకు, భాగ్యలక్ష్మి కాలనీలో రూ.4.50 కోట్లతో సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ పూర్తి చేసినందుకు కాలనీల ప్రజలు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సుభాష్ నగర్ ఫేస్-1లో మిగిలి ఉన్న డ్రైనేజీ పూర్తి చేయాలని, కమిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యే ని కోరగా అక్కడే ఉన్న అధికారులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరలోనే పూర్తి చేయాలని ఆదేశించారు.

భాగ్యలక్ష్మి కాలనీలో మిగిలి ఉన్న ఇంటర్నల్ సీసీ రోడ్లు పూర్తి చేయాలని, ఓపెన్ నాలా పనుల్లో వేగంగా పెంచాలని ఎమ్మెల్యే ని కోరగా సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఈఈ పాపమ్మ, ఏఈ సురేందర్ నాయక్, డిజీఎం రాజేష్, మాజీ కౌన్సిలర్ బొబ్బ రంగారావు, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు మన్నె రాజు, కుంటి మల్లేష్, రాములు, అరుణ రెడ్డి, పద్మజ రెడ్డి, కాలనీల సంక్షేమ సంఘాల అధ్యక్షులు బి.కృష్ణ, సాగర్ రెడ్డి, మల్లారెడ్డి, బాలరాజు, ధన రాజు, చందర్ రావు, కెవి రమణ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, యాదగిరి, రామ్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వేణు గోపాల్, ఐలేష్ గౌడ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS