SAKSHITHA NEWS

130 సుభాష్ నగర్ డివిజన్ పరిదిలోని సాయిబాబా నగర్, కృషి కాలనీ, పుష్పగిరి బస్తి లలో పాద యాత్ర..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 109వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా సాయిబాబా నగర్, కృషి కాలనీ, పుష్పగిరి బస్తి లలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి మిగిలి ఉన్న చిన్నపాటి పనులను తెలుసుకున్నారు. కాగా నీటి సరఫరా, సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ పనులు పూర్తి చేసినందుకు కాలనీల ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ మంగళ హారతులతో ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు. శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం కాలనీల అభివృద్ధికి కృషి చేసినందుకు కాలనీవాసులంతా ఎమ్మెల్యే వెంటే ఉంటామని హామీ ఇచ్చారు. మిగిలి ఉన్న చిన్నపాటి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో.. అక్కడే ఉన్న సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు.

వాటిని త్వరలోనే పూర్తి చేయాలన్నారు అనంతరం బస్తిలలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను సందర్శించి విజ్ఞేశ్వరుడికి ప్రత్యేక పూజలు నివహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలను శాశ్వతంగా అధిగమించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పట్టించుకోని అనేక బస్తీలు, కాలనీలలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యేక దృష్టి వహించి కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పూర్తి చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి కాలనీ, బస్తీ రూపురేఖలు మారుతున్నాయన్నారు. సంక్షేమ సంఘాలు ఇదే ఐక్యతతో ఉంటూ అభివృద్ధికి సహకారం అందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి ఫిషరీస్ కో ఆపరేటివ్ చైర్మన్ మన్నే రాజు, మాజీ కౌన్సిలర్ రంగ రావు, డివిజన్ అద్యేక్షులు పోలె శ్రీకాంత్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సంపత్ మాధవ్ రెడ్డి, వెంకట్ స్వామి, యూసుఫ్, తారా సింగ్, రాజకుమార్, బైరేష్ గౌడ్, భాస్కర్ రెడ్డి, రామ్ రెడ్డి, మహేష్ గౌడ్, శంకర్, ప్రభాకర్, కిషోర్, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, నర్సింహా గౌడ్, లచ్చి రెడ్డి సంక్షేమ సంఘాల కార్యవర్గ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS