SAKSHITHA NEWS

తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని గెలిపించినందుకు 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ ఆదర్శ్ నగర్ ఆడిటోరియం నందు కార్పొరేటర్ బి.విజయ శేఖర్ గౌడ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సమావేశానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ మీ పట్టుదల, కార్యాచరణతో నాకు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో అఖండ విజయాన్ని అందించిన మీ రుణం జన్మలో తీర్చుకోలేనిదన్నారు. గత రెండు పర్యాయాలు సీఎం కేసిఆర్ ఆశీర్వాదాలు, కేటీఆర్ సహాయ సహకారాలతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ది చేశామని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ గెలుపుతో మనపై మరింత బాధ్యత పెరిగిందని మరింత అంకిత భావంతో పనిచేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఏర్వ శంకరయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్. సుధాకర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు జయరాం, సుబ్బారెడ్డి, ఎండి.గౌస్, సిరాజ్, ఖాజా మియా, లక్ష్మీ నాథ్, లక్ష్మణ్ గౌడ్, ఖాదర్, ఓంకార్ రెడ్డి, అర్శద్, ఎం.శ్రీనివాస్, కార్తీక్ గౌడ్, సతీష్, రాజేష్ గౌడ్, మాజీ ప్రజప్రతినిధులు, మహిళా నాయకురాలు, సంక్షేమ సంఘం సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,

Whatsapp Image 2023 12 06 At 2.34.42 Pm

SAKSHITHA NEWS