కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద 131- కుత్బుల్లాపూర్ డివిజన్ వాణి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ వాణి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడుగా నియమితులైన రాజేంద్రప్రసాద్ మరియు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంక్షేమ సంఘం సభ్యులు కాలనీ అభివృద్ధికై కృషిచేయాలన్నారు.