అభివృద్ధి, సంక్షేమంతో ఫుల్లీ లోడెడ్ లీడర్ గా ఉండే ఎమ్మెల్యే కేపీ. కేపీ వివేకానంద తో కలిసి పనిచేసేందుకు నాకు భారీ మెజార్టీని అందించండి : ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి …
చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో భాగంగా 127 – రంగారెడ్డి నగర డివిజన్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన నేతలు….
మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా చింతల్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద , బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి , డివిజన్ కార్పొరేటర్ బి. విజయ శేఖర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాజ్గిరి లోని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తోడుగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ ఉన్నట్లయితే రెట్టింపు వేగంతో అభివృద్ధి జరుగుతుందన్నారు. జాతీయ పార్టీలు వారి ప్రయోజనాల కోసం పనిచేస్తాయి తప్పా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయవు. మన గొంతు వినిపించే నాయకుడు పార్లమెంట్లో ఉంటే మనకు వచ్చే నిధులను కొట్లాడి సాధించుకోవచ్చు అంతేకానీ జాతీయ పార్టీల అభ్యర్థులు ఉంటే వారు నాయకత్వం మాటలకు తల ఊపడం తప్పా చేసేది ఏమీ ఉండదు. ఇక పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే ఎన్నికల ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్లమెంట్లో బిఆర్ఎస్ ఎంపీ ఉంటే జరిగే అభివృద్ధిని, జాతీయ పార్టీల ఎంపీలు ఉంటే జరిగే అనర్థాలను ప్రజలకు వివరించి బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలన్నారు. 420 దొంగ హామీలతో వారంటీ లేని గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అనుభవలేమితో ప్రజలందరూ అవస్థలు పడుతున్నారు.
అనంతరం ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ హుజురాబాద్ లో చెల్లని రూపాయి మల్కాజిగిరిలో ఎలా చెల్లుతుంది. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పనిచేసిన సునీత మహేందర్ రెడ్డి కి అసలు మల్కాజ్గిరి, మల్కాజిగిరి సమస్యలపై అవగాహన ఏమి ఉందన్నారు. ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి ఏనాడైనా కుత్బుల్లాపూర్ కి వచ్చాడా…? ప్రజా సమస్యలు ఎప్పుడైనా తెలుసుకున్నారా.. ?
రాజకీయాల కోసం ఎన్నికలప్పుడు ప్రజల్లో తిరిగే నాయకులను కాకుండా ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో నిత్యం ప్రజల్లో ఉంటూ కుత్బుల్లాపూర్ ను ఎంతో అభివృద్ధి చేసిన ఫుల్లీ లోడెడ్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద తో కలిసి పనిచేసేందుకు బిఆర్ఎస్ అభ్యర్థి అయిన నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.