నియోజకవర్గాన్ని అగ్రపధాన నిలిపే ఎమ్మెలే కే. పీ. వివేకానంద వెంటే మా పయనం : భగత్ సింగ్ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనాథ్ రావు…
సాక్షిత : పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో భగత్ సింగ్ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనాథ్ రావు, పరశురాం లతో పాటు దాదాపు 20 మంది ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధిలో నియోజకవర్గాన్ని అగ్రపదాన నిలిపే నాయకుడు కే. పీ. వివేకానంద కే తమ పూర్తి మద్ధతు అని తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద మాట్లాడుతూ భగత్ సింగ్ నగర్ అభివృద్ధిలో తమ సహాయ సహకారాలు మున్ముందు కూడా కొనసాగుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలయ్య తదితరులు పాల్గొన్నారు