SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద తెలంగాణ లారీ డ్రైవర్స్ అసోసియేషన్ ఐడిపిఎల్ & చింతల్ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయ సంహిత 106/2 – HIT and RUN చట్టాన్ని వ్యతిరేకిస్తూ లారీ డ్రైవర్లు తలపెట్టిన బంద్ కు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పేదవాడి పొట్టకొడుతూ కార్పొరేట్లకు దోచిపెట్టే విధంగా ఒంటెద్దు పోకడలకు పోతుందని, ఈ విధానాలతో పేద ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇటువంటి అసంబద్ధ చట్టాలను రద్దు చేసే వరకు బిఆర్ఎస్ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ లారీ డ్రైవర్స్ అసోసియేషన్ – బిఆర్టియూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అద్యక్షులు ఇస్మాయిల్, ఉపాధ్యక్షులు ఎండి.చాంద్ పాషా, ఎండి. సయ్యద్ అసద్, ప్రధాన కార్యదర్శి ఆర్.వినోద్ కుమార్, సంయుక్త కార్యదర్శిలు డి. ఎల్లా కుమార్, మసూం సయీద్, సభ్యులు గోండ్ శివాజీ, ఎండీ.గౌస్, పి. లింగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 13 At 3.12.52 Pm

SAKSHITHA NEWS