ఈటెల, పట్నం సునీత మహేందర్ రెడ్డి కుటుంబాలు పదవుల కోసం రాజకీయాలు చేస్తారు గానీ ప్రజల ప్రయోజనాల కోసం కాదు…*
పార్టీ మారింది మేయర్, కార్పొరేటర్లు మాత్రమే…. క్యాడర్ కాదు… ఓటర్లు టిఆర్ఎస్ పార్టీకే ఫిక్స్ అయి ఉన్నారు..*
నాయకులు, కార్యకర్తలు ఎవరూ భయపడవద్దు… మీ వెంట మేముంటాం…
నిజాంపేట్ కార్పొరేషన్ బిఆర్ఎస్ నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బిజెపి, కాంగ్రెస్ పార్టిలపై ద్వజమెట్టిన ఎమ్మెల్యే కేపీ. వివేకానంద , ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ….*
నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద , బిఆర్ఎస్ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ రాబోయే 35 రోజులు మనకు ఎంతో కీలకమని గత పదేళ్లలో చేపట్టిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికి వివరిస్తూ ప్రతి నాయకుడు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు వివరించాలన్నారు. రెండు జాతీయ పార్టీలు ప్రజల బాగోగులు పట్టించుకోవని వారు ఏ పనిచేయాలన్నా ఢిల్లీ నుంచి ఆదేశాలు రావాలన్నారు. రాష్ట్రాల అభివృద్ధి జాతీయ పార్టీలతోనే వేగవంతంగా జరుగుతుందని దీనికి నిదర్శనం గత పది ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్దే సాక్ష్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుందో, ఎప్పుడు కూలుతాయో తెలియదన్నారు.
అనంతరం ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పదేళ్ల క్రితం కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో బురద మయమైన రోడ్లు, మంచినీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకుండా అస్తవ్యస్తంగా ఉండేదని గత పదేళ్ల కాలంలో ఎమ్మెల్యే వివేకానంద 6000 కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ఇప్పుడు కత్బుల్లాపూర్ అంటే అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు మేకల వెంకటేశం, బాలాజీ నాయక్, ఆగం రాజు, కాసాని సుధాకర్, రాఘవేందర్ రావు, రవి కిరణ్, రజిత రవికాంత్, జ్యోతి నరసింహారెడ్డి, బొర్ర దేవి చందు, శనిగల ప్రణయ ధనరాజ్ యాదవ్, గాజుల సుజాత, పైడి మాధవి, కొలన్ సునీల్ రెడ్డి, విజయలక్ష్మీ సుబ్బారావు, కో-ఆప్షన్ సభ్యులు వీరేష్, చంద్రగిరి జ్యోతి సతీష్, మేడ్చల్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ నాగరాజు యాదవ్, దుండిగల్ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు జస్వంత్, నాగేష్, బొబ్బ శ్రీనివాస్, శ్రీకర్ గుప్తా, నరసింహ రాజు, బిక్షపతి, స్టాలిన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, కొండా వేణుగోపాల్, మధుసూదన్, మురళి యాదవ్, రామకృష్ణ, కదరయ్య, కొలన్ సత్తిరెడ్డి, విజయ్ కుమార్, విజయ రవీంద్రబాబు, ఏనుగుల రాజశేఖర్ రెడ్డి, బిక్షపతి, అశోక్, ముత్యాలు, యూత్ అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, షేక్ ఖాన్, నబీ, సలీం, కుమార్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు అర్పిత, నాయకురాలు నర్మదా, స్వర్ణ, రోహిణి, నాయకులు సాంబశివరెడ్డి, వీరుడు యాదగిరి, డి. స్వామి, అజయ్ వర్మ, దివాకర్ రెడ్డి, చంద్రయ్య, యూత్ నాయకులు ఆనంద్ రెడ్డి, కే.క్రిష్ణ, అనుబంధ సంఘాల సభ్యులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.